తెలంగాణలో గురువారం ఒక్కరోజే 27 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో గురువారం ఒక్కరోజే 27 కరోనా పాజిటివ్‌ కేసులు
X

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 970కి చేరింది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 693గా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story