కరోనా రిలీఫ్‌ : దివాళా నుంచి 6 నెలలు మినహాయింపు

కరోనా రిలీఫ్‌ : దివాళా నుంచి 6 నెలలు మినహాయింపు
X

వచ్చే 6నెలల పాటు కంపెనీలకు దివాళా నుంచి మినహాయింపునిచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ అనుమతించింది. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన సూచనల ఆధారంగా 2016 ఇన్సాల్వెన్సీ అండ్‌ దివాళా కోడ్‌(ఐబీసీ)కి సవరణ చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆరు నెలల వరకు కంపెనీలకు దివాళా నుంచి ఉపశమనం కలిగే ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం రావాల్సి ఉంది.

కొత్త సెక్షన్‌ 10Aకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే 7, 9, 10 సెక్షన్లను తాత్కాలికంగా పక్కన పెట్టనున్నారు. అయితే కొత్త నిబంధనను సంవత్సరానికి విస్తరించకూడదు. "6 నెలల కాలపరిమితి ఇవ్వడానికి కొత్త సవరణను ప్రతిపాదించబడింది. కోవిడ్‌-19 కారణంగా ఈ సమయంలో దివాలా కోసం కొత్త డీఫాల్ట్‌ కేసులను నమోదు చేయరు." అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Tags

Next Story