కరోనా కేంద్రంగా బెంగాల్ లో రాజుకుంటున్న రాజకీయ వేడి

కరోనా కేంద్రంగా బెంగాల్ లో రాజుకుంటున్న రాజకీయ వేడి

ప్రపంచం మొత్తం కరోనాతో యుద్ధం చేస్తుంటే.. పశ్చిమ బెంగాల్ లో మాత్రం గత కొంత కాలం నుంచి కరోనా కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్‌కు, సీఎం మమతా బెనర్జీకి మధ్య విభేదాలు తార స్థాయికి చేరాయి. ఒకరికి ఒకరు ఉత్తర ప్రత్యుత్తరాలతో మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు.

మమతా ప్రభుత్వం కరోనా కట్టడిలో ఘోరంగా విఫలమైయ్యారని గవర్నర్ జగదీప్ ధన్కర్‌ కొంత కాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం ఆమెను ఉద్దేశిస్తూ రాసిన లేఖలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్రంగా విఫలమయ్యారని.. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఆమె కొత్త వ్యూహాలు రచిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.

నిజాముద్దీన్ ఘటనపై మమతను ప్రశ్నించిన పాత్రికేయుడకు మతపరమైన అంశాలను తనను అడగొద్దని అని ఆమె సమాధానమిచారని ఆయన అన్నారు. దీన్ని చూస్తుంటే మైనారిటీ ఓటింగ్ కోసం ఆమె ప్రయత్నిస్తున్నారని అర్ధమవుతోందని.. ఇది చాలా దురదృష్టకరమని ఆయన లేఖలో మండిపడ్డారు.

అయితే ఆయన రాసిన లేఖకు స్పందించిన మమత బెనర్జీ.. తాను ప్రభుత్వాధినేతగా ఎన్నికయ్యానని.. ఆయన మాత్రం నామినేట్ అయ్యారని.. ప్రభుత్వ వ్యవహారంలో ఆయన తరుచూ జోక్యం చేసుకుంటున్నారని ఆమె రిప్లై ఇచ్చారు. అయితే దీనికి మరో ఉత్తరాన్ని రాసిన గవర్నర్ మీరు రాజ్‌భవన్‌కు ఎప్పుడూ స్నేహితురాలే పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story