25 April 2020 7:55 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / మాస్కోలో మహమ్మారి.....

మాస్కోలో మహమ్మారి.. ఒక్కరోజులో 5,966 కేసులు..

మాస్కోలో మహమ్మారి.. ఒక్కరోజులో 5,966 కేసులు..
X

కరోనా మహమ్మారి రష్యా రాజధాని మాస్కో వాసులను కలవరపెడుతోంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైనప్పుడే అప్రమత్తమై కరోనా కట్టడి చర్యలు చేపట్టింది రష్యా. అయినప్పటికి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 5,966 కేసులు నమోదు కావడంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 74,588కి చేరుకుంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 681 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,250 మంది చికిత్స తీసుకుని కోలుకున్నారు. గత వారం రోజుల్లోనే దేశం మొత్తంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేలకు చేరడం ఆందోళన కలిగిస్తుంది. లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ రోజుకి 5 వేలకు పైగా కేసులు వెలుగు చూస్తున్నాయి.

Next Story