రోడ్లపై ఆటలు ఆడుతున్న పిల్లలు.. తల్లిదండ్రులపై క్రిమినల్ కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రాణాంతకర మహమ్మారిని కట్టడి చేయడానికి సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. అయితే ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా చిన్న పిల్లలకు, వృద్ధులపై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో 10 ఏళ్ల లోపు పిల్లలను, 60 ఏళ్ల పైబడిన వృద్ధులను ఈ కష్ట కాలంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయినా కొందరు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నారు.
తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణంలో రోడ్లపైకి పిల్లలను నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో పిల్లల తల్లిదండ్రులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చింతల్‌పేటలో రోడ్లపై ఆటలు ఆడుతున్న 12 మంది పిల్లలను పోలీసులు పట్టుకున్నారు. వారి తల్లిదండ్రులను గుర్తించి లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వారిని రిమాండ్‌కు పంపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com