ఆంధ్రా మత్స్యకారుల కోసం గుజరాత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన రాహుల్ గాంధీ

ఆంధ్రా మత్స్యకారుల కోసం గుజరాత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన రాహుల్ గాంధీ
X

గుజరాత్‌లో చిక్కుకున్న ఆంధ్ర ప్రదేశ్ మత్స్యకారులను ఆదుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని కోరారు. ప్రయాణించే అవకాశం లేకపోవడంవల్ల చిక్కుకున్న మత్స్యకారులను సహాయక శిబిరాలకు తరలించాలని కోరారు.

లాక్ డౌన్ కారణంగా 6,000 మంది మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకున్నారని, వారికి నిత్యావసరాలు అందడం లేదని.. పరిశుభ్రతలేని ప్రాంతాలలో గడుపుతున్నారన్నారని ట్వీట్ చేశారు. వీరంతా నెల రోజుల నుంచి నుంచి తమ చిన్న చేపల వేట పడవలకే పరిమితమయ్యారు. వారిని సహాయక శిబిరాలకు తరలించి.. కనీస వసతులు కల్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరారు.

Tags

Next Story