క్వారెంటైన్‌కు 14 మంది బీఎస్ఎఫ్ జవాన్లు

దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు చేపట్టింది. కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈ లాక్‌డౌన్ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన 14 మంది బీఎస్ఎఫ్ జవాన్లు.. ఇటీవల ఆగ్రాలో పోలీసులకు సాయంగా 20 రోజులపాటు విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో వారి కోసం అక్కడ ఒక ప్రత్యేక క్యాంపు ఏర్పాటుచేశారు. ఆ క్యాంపు వంటగదిలో పనిచేసిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా 14 మంది జవాన్లు క్వారంటైన్‌కు తరలించారు. శనివారం సాయంత్రమే వీరంతా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయ్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన వెంటనే వీరి నమూనాలను సేకరించి క్వారెంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com