ఆస్ట్రేలియాలో కరోనా ట్రేసింగ్ యాప్.. ప్రజల నుంచి భారీ స్పందన

ఆస్ట్రేలియాలో కరోనా ట్రేసింగ్ యాప్.. ప్రజల నుంచి భారీ స్పందన

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ కరోనా ట్రేసింగ్ యాప్ ను ఆవిష్కరించింది. దీంతో కరోనా జాడను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. బ్లూటూత్ ద్వారా పనిచేసే ఈ యాప్.. 1.5 మీటర్ల దూరంలో.. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న వాళ్లెవరైనా ఉంటే వెంటనే గుర్తిస్తుంది.దీనిని వాడుతున్న వారికి ఎవరికీ అయినా.. కరోనా ఉంటే ఆరోగ్య శాఖ అధికారులు ఇతర వినియోగదారులను అప్రమత్తం చేస్తారు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 6,719 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీరిలో ఇప్పటికే చాలా మంది కోలుకున్నారు. 83 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ యాప్ ను విడుదల చేసిన తరువాత ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ దేశ కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ‘కొవిడ్ ‌సేఫ్’ పేరుతో దీనిని విడుదల చేయగా.. ఐదు గంటల్లోనే 10 లక్షల మందికి పైగా దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు 11.3 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. ఐదు రోజుల్లో పది లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటారని తాము భావించామని.. కానీ, ఐదు గంటల్లోనే మేము ఆ లక్ష్యాన్ని చేరుకున్నామని ప్రభుత్వం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story