కరోనా కొత్త లక్షణాలు

కరోనా కొత్త లక్షణాలు

ప్రాణాంతక మహమ్మారి కరోనా దాని రూపాలను మార్చుకుంటుంది. ఈ మహమ్మారి సోకినా వారిలో కొత్త, కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు జ్వరం, దగ్గు, శ్వాస లక్షణాలతో కరోనా కనిపిస్తుంది. గత రెండురోజుల క్రితం కాళ్ళు, చేతులు బొబ్బర్లు రావటం కూడా ఒక లక్షణంగా గుర్తించారు. అయితే తాజాగా.. అమెరికాకి చెందిన ఆరోగ్య సంస్థ ‘ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ మరికొన్ని లక్షణాలను వెలుగులోకి తెచ్చింది. చ‌లి, అస్తమానం చ‌లితో కూడిన వ‌ణుకు, కండ‌రాల నొప్పి, త‌ల‌నొప్పి, గొంతు నొప్పి, కొత్తగా రుచి, వాసన గుర్తించలేకపోవడం వంటివి కూడా క‌రోనా ల‌క్ష‌ణాలుగా కనిపిస్తున్నాయని తెలిపింది. కాగా.. చాలా కేసులు ఏ లక్షణాలు లేకుండానే బయటపడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story