కిమ్‌పై వస్తున్న వార్తల్లో నిజం లేదు: ఉత్తర కొరియా ప్రభుత్వం

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై వస్తున్న వార్తలపై అక్కడి ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. తమ అధ్యక్షుడు చనిపోయాడని వస్తున్నా వార్తలను వారు ఖండించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని కొరియాకు చెందిన ఓ టీవీ ఛానల్‌కు లిఖిత పూర్వకమైన సందేశాన్ని కిమ్ పంపినట్లు వార్తలు వస్తున్నాయి. కిమ్ జోంగ్ ఉన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆయన భద్రతా సలహాదారు మూన్ జేయ్ ఇన్ తెలిపారు. ప్రస్తుతం కిమ్ ఓ రిసార్ట్‌లో విడిదిలో ఉన్నట్లు, అక్కడి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కన్నారు.
ఏప్రిల్ 13 నుంచి ఈ రిసార్టులో ఉంటున్నారని.. ఏప్రిల్ 15న ఆయన పుట్టిన రోజు వేడుకలు కూడా ఇక్కడే జరిగాయని మూన్ జేయ్ తెలిపారు. కిమ్ ఆరోగ్యంపై గార కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయని.. చివరకు అవి.. కిమ్ మరణించాడనే వరకు వెళ్లాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com