ఆంధ్రప్రదేశ్

వలస కూలీల బాధ్యత కేంద్రానిదే: శివసేన

వలస కూలీల బాధ్యత కేంద్రానిదే: శివసేన
X

వలస కూలీల విషయంలో పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకోవాలని శివసేన డిమాండ్ చేసింది. వలస కూలీలు అంతా తమ తమ ఇళ్లకు చేరుకోడానికి కేంద్రమే ప్రత్యేకంగా బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయాలని ‘సామ్నా’ పత్రిక ద్వారా డిమాండ్ చేసింది. వలస కూలీలు ఇలాగే గుంపులు గుంపులుగా ఉంటే వారి ఆరోగ్యానికి మంచిది కాదని తెలిపారు.

హరిద్వార్‌లో చిక్కుకుపోయిన గుజరాతీ యాత్రికులను ఎలా గుజరాత్‌కు తీసుకొచ్చారో.. వలస కూలీల విషయంలోనూ అలాగే జరగాలని అన్నారు. వారందరూ తమ కుటుంబ సభ్యులపై బెంగ పెట్టుకున్నారని తెలిపారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం.. కావాలనే వలస కూలీలను రెచ్చగొట్టి రోడ్లపైకి తేవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Next Story

RELATED STORIES