కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్.. 22.17 శాతంకి చేరిన డిశ్చార్జ్ అయిన రోగులు

X
గడిచిన 24 గంటల్లో భారత్ లో 1396 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,892కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఒక్కరోజు 381 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని.. ఇప్పటివరకూ 6184 మంది కోలుకున్నారని ప్రభుత్వం తెలిపింది. ఇంకా 20,835 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కోలుకుంటున్న వారి శాతం ప్రస్తుతానికి 22.17గా ఉన్నట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలోని గత 28 రోజులుగా 16 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని.. ఈ జాబితాలో కొత్తగా మరో 3 జిల్లాలు చేరాయని అన్నారు. అటు మరో 85 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని ఆయన ప్రకటించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
