గుజరాత్ లో వలస కార్మికుల నిరసన

గుజరాత్ లో వలస కార్మికుల నిరసన
X

గుజరాత్ లో వలస కార్మికులు తమ స్వస్థలాలకు పంపించాలని ఆందోళనకు దిగారు. సూరత్‌లోని డైమండ్ బుష్ వద్ద వేలాది మంది వచ్చి రాళ్లదాడికి పాల్పడ్డారు. లాక్‌డౌన్ సమయంలో కూడా పనిచేశామని, ఇప్పటికైనా తమను సొంత ఊళ్లకు పంపాలంటూ నిరసనకు దిగారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వలస కార్మికులకు నచ్చచెప్పారు. పరిస్థితి చేయి దాటిపోకుండా చూశారు.

ఇటీవల ముంబైలో కూడా వలస కార్మికులు ఆందోళనకు దిగారు. మహారాష్ట్ర, గుజరాత్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇంకా లాక్ డౌన్ కొనసాగిస్తారని ఊహాగానాలు రావటంతో వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

Tags

Next Story