తెలంగాణాలో కొత్తగా 6 కేసులు.. 42 మంది డిశ్చార్జ్

తెలంగాణాలో కొత్తగా 6 కేసులు.. 42 మంది డిశ్చార్జ్

గత నాలుగు రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 6 కొత్త కేసులు నమోదైయ్యాయి. దీంతో మొత్తంకేసులు సంఖ్య 1,009కి చేరాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కొత్తగా నమోదైన ఆరు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనన్నారు. మంగళవారం 42 మంది డిశ్చార్జ్‌ అయ్యారని.. ఇప్పటివరకు 374మంది డిశ్చార్జ్‌ అయినట్లు ఈటల స్పష్టం చేశారు. 610 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 25మంది మృతి చెందారని చెప్పారు. ఈ నెల 21 నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story