ఈ సమయంలో కూడా దేశంలో కూరగాయల కొరత లేదు: కేంద్ర మంత్రి

ఈ సమయంలో కూడా దేశంలో కూరగాయల కొరత లేదు: కేంద్ర మంత్రి
X

ఈ సంక్షోభ సమయంలో కూడా దేశంలో కూరగాయలు కొరత లేదని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వ్యవసాయ ఆధారిత దేశం కావటంతో ప్రభుత్వం కూడా నిరంతరం వ్యవసాయరంగంపై దృష్టి సారిస్తూనే ఉందన్నారు. సంక్షోభ సమయంలోనూ ఎగ్రికల్చర్ ఎకానమీకి ఎంతో ప్రాధాన్యం ఉందని.. అందుకే దేశంలో ఇవాల్టికి కూడా దేశంలో ఎక్కడా కూరగాయల కొరత ఏర్పడలేదని ఆయన పేర్కొన్నారు.

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్)తో రైతులకు ఎంతో లబ్ధి జరిగిందని.. మార్చి 24 నుంచి రైతులకు రూ.17,986 కోట్లు బదలాయించామని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

Tags

Next Story