తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌కు మరోసారి నోటీసులు

తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌కు మరోసారి నోటీసులు
X

తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌కు ఢిల్లీ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేసినా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో మరోసారి నాలుగోసారి పంపించారు. మౌలానా సాద్ ప్రభుత్వ లాబోరేటరీకి వచ్చి కరోనా పరీక్ష చేయించుకోవాలని.. పోలీసుల దర్యాప్తునకు హాజరుకావాలని డిల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే.. ఆయన తరుపు న్యాయవాది.. మౌలానా సాద్ ఇప్పటికే ప్రైవేటు లాబోరేటరీలో కరోనా పరీక్ష చేయిచుకున్నారని.. ఆయనకు నెగటివ్ వచ్చిందని ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులకు నివేదిక సమర్పించారు. కాగా.. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో తబ్లీగ్ జమాత్ సమావేశం నిర్వహించి దేశంలో కరోనా ప్రబలేందుకు కారణమయ్యారని మౌలానా సాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద మౌలానాపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాముద్దీన్ సమావేశానికి హాజరైన వారిలో వందలాదిమందికి కరోనా వైరస్ సోకిందని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీంతోపాటు తబ్లీగ్ జమాత్ కు విదేశాల నుంచి మనీలాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించి హవాలా ద్వార విరాళాలు సేకరించారని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సాద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Next Story