కనికా కపూర్ ను విచారిస్తున్న లక్నో పోలీసులు

కనికా కపూర్ ను విచారిస్తున్న లక్నో పోలీసులు
X

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు లక్నో పోలీసులు విచారణ చేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆమె యూకే నుంచి వచ్చిన విషయం తెలిసిందే. తరువాత పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమెకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆమె ఏఏ పార్టీలకు హాజరైంది.. అనేదానిపై లక్నో పోలీసుకు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. కనికా పాస్‌పోర్టుతో పాటు విమాన టికెట్లు, ఇతర డాక్యుమెంట్ల ఫోటో కాపీలు కూడా పోలీసులు సేకరించారు. ఆమెకు మార్చి 20న కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. కానీ, అప్పటికే ఆమె అనేక పార్టీలలో పాల్గొనటంతో కలకలం రేగింది. ఆమె యూకే నుంచి వచ్చిన విషయాన్ని కూడా తెలపకపోవడంతో.. ఆమె కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించారని ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే పలుసార్లు.. కరోనా నెగెటివ్ వచ్చినా.. ఆమె ఇప్పుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న విషయం తెలిసిందే.

Tags

Next Story