20 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్‌

20 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్‌
X

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తోంది. ఇండియాలో కూడా ఈ మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ప్రధాన నగరాల్లో ప్రతాపం చూపుతున్న ఈ వైరస్‌.. కొన్ని రోజులుగా చిన్న పట్టణాలనూ కబళిస్తోంది. తాజాగా దేశంలో కరోనా మహమ్మారికి కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలోని థానే జిల్లాలో 20 రోజుల చిన్నారికి కరోనా వైరస్‌ సోకింది. థానే జిల్లాలోని కల్యాన్‌ దాంబివ్లీ మున్సిపల్‌ పరిధిలో 20 రోజుల బాలుడితోసహా ఆరుగురికి కరోనా పాజిటివ్‌ సోకింది. దీంతో ఈ ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య 162కు చేరింది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 9,915 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 432 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story