ఆంధ్రప్రదేశ్

వైజాగ్‌లో వైరస్ టెన్షన్.. క్వారంటైన్‌లో 40 మంది వైద్య సిబ్బంది

వైజాగ్‌లో వైరస్ టెన్షన్.. క్వారంటైన్‌లో 40 మంది వైద్య సిబ్బంది
X

వైజాగ్‌లో‌ తొలి కరోనా మరణం నమోదైంది. నగరంలోని కేజీహెచ్ ఆస్పత్రిలో ఓ వృద్ధుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించాడు. మరణానికి ముందే చేసిన టెస్ట్ రిపోర్టులో కరోనా పాజిటివ్ అని వచ్చింది. కుటుంబసభ్యులు డెడ్‌బాడీని ఇంటికి తీసుకు వెళ్లడంతో అధికారులు ఆందోళన చెంది అప్రమత్తమయ్యారు. వృద్ధుడికి చికిత్స చేసిన వైద్య సిబ్బందితో సహా మరికొంత మందికి కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. మరో కేసు మాధవధారలో వెలుగు చూసింది.

ఆర్మీలో పని చేసే ఓ వ్యక్తి గత నెల 20న మృతి చెందారు. అతడికి కరోనా పాజిటివ్ రావడంతో భార్యా, పిల్లలకు పరీక్షలు చేశారు. ఆమెకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. మహారాణిపేట దండు బజార్ సమీపాన ఉన్న దిబ్బలపాలెంలో ఓ వృద్ధురాలికి గురువారం కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెకు, ఆమె కుమారుడికీ పాజిటివ్ వచ్చింది. వృద్ధురాలి కుమారుడు వాటర్ ఫ్యూరిఫైర్ మిషన్లు రిపేర్ చేస్తుంటాడు.

విధుల్లో భాగంగా ఇటీవల ఓ ఇంటికి వెళ్లాడు. అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన వారు వున్నారని తెలిసింది. ఆ కోణంలోనూ పరిశీలన జరుగుతోంది. దాంతో వారితో అనుబంధం ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించారు. మరోచోట చెంగల్రావుపేటకు చెందిన వృద్ధుడు మరణించిన తరువాత పాజిటివ్ అని తేలింది. అతడికి వైద్యం చేసిన వైద్య సిబ్బందితో సహా 40 మందికి శుక్రవారం కరోనా పరీక్షలు చేశారు. వారందరినీ క్వారంటైన్‌కు పంపించారు.

Next Story

RELATED STORIES