ఆప్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

ఆప్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌
X

ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సామన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది. తాజాగా ఢిల్లీకి చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే విశేష్‌ రవికి కరోనా సోకింది. రవితో పాటు అతని సోదరుడికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విశేష్‌ రవికి బుధవారం కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. శుక్రవారం ఫలితం రాగా పాజిటివ్‌గా తేలింది. అయితే కరోనా అనుమానిత లక్షణాలేవీ ఎమ్మెల్యేలో కనిపించక పోవటం విశేషం. ఇప్పటి వరకు ఢిల్లీలో 3515 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 59 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story