రాజస్థాన్ లో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు

రాజస్థాన్ లో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు
X

రాజస్థాన్ లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బుల్లెటిన్ ప్రకారం ఒక్కరోజులో రాష్ట్రంలో 54 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,720కి చేరాయి. ఈ రోజు ముగ్గురు కరోనాతో చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 65కి చేరింది. ఇప్పటివరకు 1,121 మంది కోలుకున్నారని.. వారిలో 714 మందిని డిశ్చార్జ్ చేశామని తెలిపారు. అటు, త్వరలోనే మిగతావారిని డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. ఇంకా 1,534 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags

Next Story