మర్కజ్ కేసు విచారణ చేస్తున్న పోలీసులకు కరోనా పాజిటివ్

తబ్లీగ్ జమాత్ అంశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఇద్దరు పోలీసులకు కరోనా వైరస్ సోకింది. ఢిల్లీలో మర్కజ్ కేంద్రంగా తబ్లీగ్ జమాత్ సమావేశాలు నిర్వహించడంతో.. దేశంలో కరోనా కేసులు బాగా పెరిగాయని తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ పై ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కేసును దర్యాప్తు చేసేందుకు డిల్లి పోలీసులు మౌలానా సాద్ ఫాం హౌస్ తోపాటు మర్కజ్ ను సందర్శించారు. వారిలో పలువురికి కరోనా లక్షణాలు కనిపించడం పరీక్షలు జరిపారు. దీంతో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. వారిని ఆస్పత్రికి తరలించి.. మరో 12 మందిని హోంక్వారంటైన్ కు తరలించారు. దేశ రాజధానిలో కరోనా వచ్చిన పోలీసుల సంఖ్య వందకు దాటింది. తబ్లీగ్ జమాత్ సమావేశాల అంశంపై విచారణకు హాజరుకావాలని మౌలానా సాద్ కు ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు నాలుగు సార్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com