కేంద్రం కొత్త మార్గదర్శకాలు..పెళ్లిళ్లకు 50 మంది.. అంత్యక్రియలకు 20 మంది

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా దెబ్బకి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ ప్రాణాంతకర వైరస్‌ని కట్టడి చేయడానికి కేంద్ర సర్కార్ లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. అయినా దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించింది. లాక్‌డౌన్ రెండో దఫా ఈ నెల 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుంచి 17వ తేదీ వరకు లాక్‌డౌన్ మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. పెళ్లి, ఇతర శుభకార్యాలకు 50 మందికి మించి అనుమతి నిరాకరించింది. ఇక అంత్యక్రియలకు 20 మందికి మించి అనుమతి నిరాకరించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, మద్యం సేవించడం, పాన్, గుట్కా, పొగాకు నమలడం నిషేధించారు. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటిస్తూ.. ఐదుగురికి కంటే మించి ఉండరాదని ఆదేశాలు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com