చంద్రబాబు విలువైన సూచనలు ఇచ్చారు: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్

X
ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. ఏప్రిల్ 19న ప్రధాని మోదీకి చంద్రబాబు రాసిన లేఖ గురించి మాట్లాడుతూ.. లాక్డౌన్ ను సమర్థవంతంగా నిర్వహించడానికి కొత్త సంస్థాగత విధానానికి శ్రీకారం చుట్టారని చంద్రబాబును కొనియాడారు. జీఎస్ఎఫ్టీ తరపున విలువైన సూచనలతో నివేదిక అందించారని లేఖలో చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. నీతి ఆయోగ్ బృందం మీ రీసెర్చ్ బృందాన్ని త్వరలోనే సంప్రదిస్తుందని చెప్పారు. కరోనా సంక్రమణ, వ్యాప్తిని గుర్తించడం కోసం సాంకేతిక పరిష్కారాలు ఏర్పాటు చేస్తోందని లేఖలో రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
