ఆంధ్రప్రదేశ్

బ్రహ్మంగారి బాటలో నడుద్దాం: చంద్రబాబు

బ్రహ్మంగారి బాటలో నడుద్దాం: చంద్రబాబు
X

లాక్ డౌన్ అమలులో ఉన్న వేళ బ్రహ్మం గారి ఆరాధనలు అందరూ ఇళ్లల్లోనే భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ప్రజలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయమని చంద్రబాబు అన్నారు. 327వ ఆరాధనా ఉత్సవాలు ఇళ్లలోనే జరుపుకోవాలని చంద్రబాబు సూచించారు. బ్రహ్మంగారి మఠం అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఇప్పడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉందని చంద్రబాబు తెలిపారు. ఈ రోజు పరిస్థితులను కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉహించి చెప్పారని అన్నారు. బ్రహ్మంగారి బాటలో నడుద్దామని.. ఆయన సూక్తులు స్మరిద్దామని చంద్రబాబు అన్నారు.

Next Story

RELATED STORIES