మద్యాన్ని ఆర్థిక వనరుగా చూడటం అనైతికం: సీపీఐ నారాయణ

మద్యాన్ని ఆర్థిక వనరుగా చూడటం అనైతికం: సీపీఐ నారాయణ
X

పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేసే వరకు మద్యపాన నిషేధం కొనసాగాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మద్యపానం వలన రోగ నిరోధక శక్తీ తగ్గుతుందని.. డాక్టర్లు చెబుతున్నారని.. కానీ, లాక్ డౌన్ సడలింపుల పేరుతో మద్యపానం అమ్మకాలకు కేంద్రం రాష్ట్రాలకు అనుమతివ్వడం సమంజసం కాదని నారాయణ మండిపడ్డారు. అసలు మద్యాన్ని ఆర్థిక వనరుగా చూడటం సరికాదని.. బిహార్‌లో మద్యపాన నిషేధం ఎప్పటి నుంచో అమలు చేస్తోందని గుర్తుచేశారు. లాక్‌డౌన్‌ సమయంలో తాగుబోతుల కేసులు తగ్గాయని, వాహన ప్రమాదాలు తగ్గాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించి.. పుర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేసేంత వరకు మద్యపాన నిషేధం అమలు చేయాలని కోరారు.

Tags

Next Story