డిజిటల్ పాసులు జారీ చేస్తాం.. దరఖాస్తు చేసుకోండి: డీజీపీ మహేందర్రెడ్డి

X
తెలంగాణ నుంచి సొంత రాష్ట్రాలకు వెళ్లేవారు tsp.koopid.ai/epass వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. చాలా దరఖాస్తులు వస్తున్నాయని.. ఉదయం నుంచి 12 గంటల వరకు 7వేల పాసులు జారీ చేశామని.. అటు, మరో 10 వేల దరఖాస్తులు పరిశీలించి పాసులు జారీ చేయాల్సి ఉందని వివరించారు. దరఖాస్తులను పరిశీలించి డిజిటల్ పాసులను జారీ చేస్తామని వివరించారు. దరఖాస్తుల వెల్లువతో డిజిటల్ పాసు సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. కొంత సమయం తర్వాత సంప్రదించాలని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
