కరోనా ఎఫెక్ట్: రాజస్థాన్ లో జరిమానాల మోత

కరోనా ఎఫెక్ట్: రాజస్థాన్ లో జరిమానాల మోత
X

కరోనా కట్టడికి రాజస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా లాక్ డౌన్ నిబంధనలు సడలించిన.. కరోనా వ్యాప్తికి కారణమైన చర్యలకు పాల్పడినా.. జరీమానా మోత మోగిస్తుంది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖానికి మాస్క్ లేకుండా ఎవరైనా పబ్లిక్ ప్రదేశాల్లో కనిపిస్తే.. వారికి 200 రూపాయలు విధిస్తామని తెలిపింది. అటు, ఏవైనా దుకాణాల్లో మాస్కులు లేని వారికి సరుకులు అమ్మినట్టు గుర్తిస్తే.. ఆ షాప్ యజమానికి కూడా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

బహిరంగ ప్రదేశంలో పాన్, పొగాకు, గుట్కా వంటివి నమిలి ఉమ్మినా కూడా 200 రూపాయలు జరిమానా వేస్తామని... ఇక బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన వారికి రూ .500 జరిమానా విధించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాచింది.

ఇంకా బహిరంగ ప్రదేశంలో సామాజిక దూరాన్ని పాటించని వారికి రూ .100 రూపాయలు.. ముందస్తు అనుమతి లేకుండా వివాహ వేడుకలు లాంటివి జరిపితే రూ .5 వేల జరిమానాను విధించనుంది.

Tags

Next Story