నా ఆస్తి అమ్మేస్తున్న.. స్పేస్ ఎక్స్ సీఈవో మస్క్ సంచలన ట్వీట్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో స్పేస్ ఎక్స్ సీఈవో, టెస్లా సహవ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గ మారింది. తన ఇల్లుతో సహా తన ఆస్తులన్నీ అమ్మేస్తానని ఆయన ట్వీట్ చేశారు. అది చుసిన అతని ఫాలోవర్లు షాక్ కి గురైయ్యారు. అసలు అతనికి ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి అని అందరు తలలు పట్టుకుంటున్నారు. అయితే.. అన్ని ఆస్తులుబి అమ్మకానికి పెట్టిన మస్క్ తన స్వాధీనంలో ఉన్న ఓ ఇంటి విషయంలో మాత్రం ఒక పెట్టారు. అలనాటి అమెరికన్ నటుడు జెనే విల్డర్స్‌కి చెందిన పాత ఇంటిని కొన్నవాళ్లు మాత్రం దానిని కూల్చివేయరాదని పేర్కొన్నారు.
అయితే.. ఈ ట్వీట్లు చూసిన ఓ ఫాలోవర్.. డబ్బులు అవసరమై ఇలా అమ్మకానికి పెడుతున్నారా? లేక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు నిరసనగా ఇలా చేస్తున్నారా? అని అడిగారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. ‘‘డబ్బు అక్కర్లేదు. అంగారకుడికి, భూమికి నన్ను నేను అంకితం చేసుకుంటున్నాను. ఆస్తులు కలిగి ఉండడం భారమే తప్ప మరోటి కాదు..’’ అని బదులిచ్చారు.
కాగా, మస్క్ ఆస్తి 38.9 బిలియన్ డాలర్ల
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com