యూఏఈలో కరోనా మహమ్మారి విజృంభణ

యూఏఈలో కరోనా మహమ్మారి విజృంభణ
X

గల్ఫ్ దేశాల్లో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌లో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 13,599 కాగా 121 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారు 119 మంది కాగా, వైరస్ ప్రభావం రోజు రోజుకు ఎక్కువ అవుతుండడంతో యూఏఈ సర్కార్ కరోనా టెస్టులు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1.2 మిలియన్ల కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. శనివారం ఒక్కరోజే కరోనాతో ఎనిమిది మంది చనిపోవడం అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. పాజిటివ్ కేసులు శనివారం ఒక్కరోజే 561 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆస్పత్రులు, అవుట్ పేషెంట్ క్లినిక్‌లతో సహా రోజుకి 10వేల పరీక్షలు నిర్వహించే సామర్థ్యం దేశానికి ఉందని అధికారులు తెలిపారు.

Tags

Next Story