ఆంధ్రప్రదేశ్

కరోనా ఎఫెక్ట్.. వెంకన్న దర్శనంలో మార్పులు

కరోనా ఎఫెక్ట్.. వెంకన్న దర్శనంలో మార్పులు
X

ఇకపై తిరుమల శ్రీవారి దర్శనం అంత సులువు కాదు. కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోయేవరకు స్వామి వారిని దర్శంచే భక్తుల సంఖ్యపై పరిమితి విధించే అవకాశం ఉంది. వైరస్ కట్టడి చర్యలో భాగంగా భక్తుల సంఖ్యను పరిమితం చేయనుంది. ఇంతకు ముందు రోజుకు 60 వేల 80వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించే వారు. లాక్డౌన్ అనంతరం రోజు వారి భక్తుల సంఖ్యలో నాలుగో వంతు మంది మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. అదీ ఆన్‌లైన్, టైమ్ స్లాటెడ్ భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా అనుమతించే సర్వ దర్శనాన్ని కొంత కాలం పాటు నిలిపివేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Next Story

RELATED STORIES