ఆ భవనంలో కరోనా కేసులు 41 కాదు.. 58

ఢిల్లీలో కాపాషెరా ప్రాంతంలో ఆదివారం 41 కేసులు బయటబడిన భవనంలో.. మరో 17 కేసులువెలుగు చూశాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 58కి చేరింది దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఆ భవనంలో నివసించే ఒక వ్యక్తికీ కరోనా రావటంతో ఏప్రిల్ 19న దాన్ని అధికారులు మూసివేశారు. అనంతరం ఈ భవనంలో విషయంలో కంటైన్మెంట్ వ్యూహం అమలు చేయాలని జిల్లా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ భవనంలోని 95 మంది దగ్గర నుంచి కరోనా పరీక్షలకు ఏప్రిల్ 20న శాంపిల్స్ సేకరించారు. ఏప్రిల్ 21న మరో 80 మంది నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. అయితే.. అందులో ఆదివారం కొంత మంది రిపోర్టులు రాగా.. 41 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా మరికొంత మంది రిపోర్టులు రావడంతో.. అందులో 17 మంది కరోనా బారిన పడ్డారని తేలడంతో అక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 58కి చేరుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com