ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షలు దాటిన మరణాలు

X
By - TV5 Telugu |5 May 2020 9:04 PM IST
కరోనా దెబ్బకి ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. రోజు రోజుకీ ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 35,84,322కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,51,595కు చేరింది. అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాలో 69 వేల మంది కరోనా వల్ల మృతి చెందారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com