కరోనా కేసుల వివరాల్లో లోపాలున్నాయని ఒప్పుకున్న బెంగాల్ ప్రభుత్వం

కరోనా కేసుల అధికారికి వివరాల్లో కొన్ని లోపాలు ఉన్నాయని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తొలిసారిగా అంగీకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ సిన్హా వ్యాఖ్యానించారు. ఒక 72 కరోనా మరణాల విషయంలో కొంత గందరగోళ ఏర్పడిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఓ వైద్యుల కమిటీ ఈ 72 రెండు మందికి కరోనాతో పాటూ ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమయ్యారని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 105 కరోనా మరణాలను పరీశిలించిన కమిటీ.. వీటిలో 72 మంది కరోనా బాధితులు దీర్ఘకాలిక రోగాల కారణంగా మరిణించారని తేల్చింది. దాంతో ఇవి కరోనా మరణాల జాబితాలోకి చేరలేదు. ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ఎప్పటికప్పుడు కరోనా లెక్కలు తెప్పించుకోవడంలో ఇబ్బంది ఎదురైందని.. దీంతో కొంత సమాచారం ప్రజలకు చేరలేదని ప్రధాన కార్యదర్శి అన్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించామని, మిస్సైన సమాచారం మొత్తం సమీకరించామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com