58 మంది ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులకు కరోనా

X
By - TV5 Telugu |6 May 2020 4:00 AM IST
కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తుంది. డిఫెన్స్ లో కూడా చాలా విభాగాల్లో కొంతమందికి కరోనా సోకింది. తాజాగా 58 మంది ఐటీబీపీ సభ్యులకు కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. ఈ వివరాలను ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ డిజీ ఎస్‌ఎస్ దేస్వాల్ మంగళవారం తెలిపారు. వీరందరినీ నోయిడాలోని ఐటీబీపీకి చెందిన రిఫరల్ ఆస్పత్రికి తరలించామని ఆయన వెల్లడించారు. బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్ తదితర విభాగాలకు చెందిన కరోనా కేసులన్నీ ఈ ఆస్పత్రికే తీసుకొస్తున్నట్లు చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com