కరోనా కేసుల విషయంలో మమత ప్రభుత్వానికి లేఖ రాసిన బీజేపీ

పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసుల విషయంలో అధికార, ప్రతిక్షాల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. కరోనా కేసుల సంఖ్యను మమత ప్రభుత్వం సరిగా చూపించడం లేదని బీజేపీ మండిపడుతుంది. నిజంగా నమోదవుతున్న కేసులకు, ప్రభుత్వం చూపిస్తున్న కేసులకు చాలా వ్యత్యాసం ఉందని ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. ఇదే విషయంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బెంగాల్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి వర్గీయ.. మమతకు ఓ లేఖ రాశారు.
సోమవారం నుంచి ప్రభుత్వం ప్రతి రోజూ కరోనాపై ఓ బులిటెన్‌ను విడుదల చేస్తోంది కానీ, లెక్కల్లో మాత్రం ఎక్కడో వ్యత్యాసం కనిపిస్తోందని ఆయన లేఖ ద్వారా అనుమానం వ్యక్తం చేశారు. కరోనాను ఎలా ఎదుర్కుంటోంది అన్న ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర ఇప్పటికీ సమాధానం లేదు. ఇప్పటికైనా సరే.. పై అనుమానాలకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానాలు, స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు.
కోట్ల మంది ప్రజలు ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఇంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న సంకేతాలను కూడా ప్రభుత్వం పంపడం లేదని ఆయన మండిపడ్డారు. ఎలాంటి ఇబ్బందులనైనా ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కుంటుందన్న భరోసాను ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత మమత సర్కార్‌పై ఉందని వర్గీయ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com