ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం.. మెడిక‌ల్ సిబ్బందికి అన్ని ర‌కాల సెల‌వులు ర‌ద్దు

ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం.. మెడిక‌ల్ సిబ్బందికి అన్ని ర‌కాల సెల‌వులు ర‌ద్దు
X

బీహార్ రాష్ట్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. మెడిక‌ల్ సిబ్బందికి అన్ని ర‌కాల సెల‌వులు ర‌ద్దు చేస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా వైర‌స్ బీహార్ లో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీహార్ రాష్ట్ర సర్కార్ వెల్లడించింది. న‌ర్సులు, వైద్యాధికారులు, డాక్ట‌ర్లు, పారామెడిక‌ల్ సిబ్బంది, గ్రేడ్ 4 సిబ్బందికి మే 31వ తేదీ 2020 వ‌ర‌కు ఎటువంటి సెల‌వులు వ‌ర్తించ‌వ‌ని ఉత్త‌ర్వులో పేర్కొంది. ప్ర‌సూతి సెల‌వు, స్ట‌డీ లీప్‌పై ఉన్న‌వారికి దీని నుంచి మిన‌హాయింపు ఉంటుంది అని పేర్కోంది.

Tags

Next Story