తెలంగాణలో ఒక్కరోజే 11 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో ఒక్కరోజే 11 కరోనా పాజిటివ్‌ కేసులు
X

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 1096కు చేరింది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 439. ఇప్పటి వరకు 628 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.

Tags

Next Story