తమిళనాడులో వరుసగా రెండో రోజు 500పైగా కేసులు

తమిళనాడులో వరుసగా రెండో రోజు 500పైగా కేసులు
X

తమిళనాడులో కరోనా మహమ్మారి పంజా ఝుళిపిస్తుంది. వరుసగా రెండో రోజు 500పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 508 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దీంతో రాష్ట్రం మొత్తం మీద కేసులు సంఖ్య 4058కి చేరింది. అటు, ఇప్పటి వరకూ, 33 మంది కరోనా వలన మరణించారు. రాష్ట్రంలో సుమారు సగం కేసులు చెన్నైలోనే నమోదవుతున్నాయి. ఈ రోజు ఒక్కరోజే చెన్నైలో 279 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 2008కి చేరింది. సోమవారం కూడా రాష్ట్రంలో 527 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Tags

Next Story