Home
 / 
అంతర్జాతీయం / యూరప్ లో ఎక్కువ కరోనా...

యూరప్ లో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశంగా బ్రిటన్

యూరప్ లో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశంగా బ్రిటన్
X

కరోనా మహమ్మారి బ్రిటన్ లో ఇప్పటి వరకు 32వేల మందికి పైగా పొట్టన పెట్టుకుంది. ఇప్పటివరకు యూరప్ లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య ఇటలీలో ఎక్కువగా ఉండగా.. తాజా గణాంకాలతో బ్రిటన్ బ్రిటన్ మొదటి స్థానానికి చేరుకుంది. ఏప్రిల్ 24 నాటికీ ఇంగ్లండ్ అండ్ వేల్స్‌లో 29,648 మంది కరోనా తో మృతి చెందారని జాతీయ గణాంకాల కార్యాలయం తెలిపింది. అయితే తాజాగా, అనుమానిత కరోనా మరణాలను కూడా చేర్చడంతో మృతుల సంఖ్య 32 వేలు దాటేసింది. దేశంలో ఇప్పటి వరకు 32,313 మంది కోవిడ్ కారణంగా మరణించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో స్కాట్లాండ్, ఉత్తర ఐర్లండ్‌లో సంభవించిన మరణాలు కూడా ఉన్నాయి.

Next Story