కరోనా ఎఫెక్ట్: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఓ గది మూసివేత

X
By - TV5 Telugu |6 May 2020 8:32 PM IST
కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూం మొదటి గది మూతపడింది. ఈ గదిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లకు కరోనా సోకడంతో రూం నెంబర్ వన్‌ను మూసేశారు. అయితే, ఈ రూంలో పనిచేసే సిబ్బంది మొత్తం సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లారు. శానిటైజింగ్ ప్రక్రియ తర్వాత గదిని తిరిగి తెరుస్తారు. అయితే, రూమ్ నెంబర్ ఒకటి మాత్రమే మూతపడింది. మిగతా అన్ని గదుల్లో విధులు యథాతథంగా కొనసాగుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com