వడగళ్ల వాన ముందు మందుబాబుల సంకల్పబలం గెలిచింది

X
40 రోజుల తరువాత మందుల షాపులు తెరవటంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. గంటల కొద్ది క్యూ లైన్లో నిలబడి మరి గొంతు తడుపుకుంటున్నారు. ఎంతటి కష్టం అయినా.. పడి చివరికిఇ మందు వేయాలని అనుకుంటున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ లో వడగండ్ల వానను కూడా లెక్క చేయకుండా.. గంటలు తెరబడి వర్షంలో నిలబడి మందుతో వెనక్కు వెళ్లారు. ఈ ఘటన నైనిటాల్లో జరిగింది. అయితే, ఇంత వర్షంలో కూడా సామాజిక దూరం పాటిస్తూ కరోనా వ్యాప్తికి అవకాశం లేకుండా జాగ్రత్తలు పాటించారు. కొందరు గొడుగులతో, మరికొందరు రెయిన్కోట్లు వేసుకుని వచ్చి చివరికి మందుతో వెళ్లారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
