ఆంధ్రప్రదేశ్

విశాఖ విషాదంపై కేంద్రమంత్రికి చంద్రబాబు లేఖ

విశాఖ విషాదంపై కేంద్రమంత్రికి చంద్రబాబు లేఖ
X

విశాఖ మహావిషాదంపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని లేఖలో కోరారు చంద్రబాబు. పరిస్తితి అదుపులోకి వచ్చే వరకూ రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు నిపుణులను ఏర్పాటు చేయాలని కోరారు చంద్రబాబు. పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీ కారణంగా దాదాపు 2 వేల మంది అనారోగ్యానికి గురి కావడం దురదృష్టకరమన్నారు చంద్రబాబు. ప్రజారోగ్యంపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. ఓ వైపు కరోనా బాధితులు మరోవైపు విషవాయువు వల్ల అనారోగ్యం పాలైనవారు ఉన్నందున.. నిపుణులైన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు చంద్రబాబు. పరిశ్రమను కాలుష్యం లేని ప్రత్యేక ఆర్ధిక మండలి - సెజ్‌కు తరలించాలని సూచించారు చంద్రబాబు. ఇక ఈ దుర్ఘటనలో పశువులు కూడా అనారోగ్యం పాలైనందున వెటర్నరీ వైద్యులను కూడా పంపాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Next Story

RELATED STORIES