ఒడిశాలో మరో రెండు కొత్త కేసులు

ఒడిశాలో మరో రెండు కొత్త కేసులు
X

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మాస్కులు కూడా తప్పని సరి చేసిన మొదటి రాష్ట్రం కూడా ఒడిశానే. అయినప్పటికీ కరోనా కేసులు పూర్తిగా తగ్గటం లేదు. బుధవారం మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 179కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 17వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించింది.

Tags

Next Story