తెలంగాణలో మరో 15 కరోనా కేసులు

తెలంగాణలో మరో 15 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 1122కు చేరింద రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 12 కేసులు నమోదుకాగా.. మరో ముగ్గురు వలస కూలీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం 45 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా.. మొత్తం 693 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 400 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా బారినపడి ఇప్పటివరకు రాష్ట్రంలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

ts

Tags

Read MoreRead Less
Next Story