ఒక్క రోజులో 11 వేలకు పైగా పాజిటివ్ కేసులు.. రష్యాలో తగ్గని కరోనా

ఒక్క రోజులో 11 వేలకు పైగా పాజిటివ్ కేసులు.. రష్యాలో తగ్గని కరోనా

కరోనా మహమ్మారి ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. పాజిటివ్ కేసుల విషయంలో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్న రష్యా గురువారం ఒక్కరోజే 11,231 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంతకు ముందెన్నడూ ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. దీంతో రష్యాలో కరోనా బాధితుల సంఖ్య 1,77,160కి చేరుకుంది. ఒక్క మాస్కో నగరంలోనే దాదాపు 92,676 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వాస్తవానికి ఈ కేసుల సంఖ్య మూడు లక్షల వరకు ఉంటుందని మాస్కో మేయర్ సోబ్యానిన్ అంటున్నారు.

ఇకపై మాస్కులు, చేతులకు గ్లవుజుల వంటివి తమ జీవితంలో భాగం చేసుకోవాలని మేయర్ మాస్కో ప్రజలకు సూచిస్తున్నారు. కోవిడ్ పరీక్షల ఎక్కువ మొత్తంలో చేస్తుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.

ప్రపంచం మొత్తంలో ఏప్రిల్ నెలలో ప్రతిరోజు సగటున 80 వేల కరోనా కేసులు వెలుగు చూశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) తెలిపింది. భారత్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి, పశ్చిమ ఐరోపాలో మాత్రం తగ్గాయని పేర్కొంది. ఇక నల్లజాతీయుల్లో కూడా కరోనా ముప్పు ఎక్కువగా ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story