ఆంధ్రప్రదేశ్

విశాఖ ఘటనపై డీజీపీ వ్యాఖ్యలు.. టీడీపీ విమర్శలు

విశాఖ ఘటనపై డీజీపీ వ్యాఖ్యలు.. టీడీపీ విమర్శలు
X

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ వివాదంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. కంపెనీపై కేసు పెట్టడం, ఫైన్ వేయడం ప్రస్తుతం ప్రాధాన్యత అంశం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంతేకాదు, ఎవరిపైనో కక్ష సాధించాలనే ఉద్దేశం తమకు లేదన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. ప్రభుత్వం నియమించిన కమిటీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. అయితే, ఘటన జరిగి 48 గంటలకు దాటినా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరైన కేసులు పెట్టకపోతే న్యాయం ఎలా జరుగుతుందని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలావుంటే, డీజీపీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ స్థాయిలో వున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అమాయకుల ప్రాణాలు పోతుంటే.. డీజీపీ మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని.. టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. బాధితులను పరామర్శించడానికి వస్తే అడ్డుకుంటున్నారని అన్నారు. బాధితులను పరామర్శించే హక్కు విపక్ష పార్టీలకు లేదా అని ప్రశ్నించారు.

Next Story

RELATED STORIES