లాక్‌డౌన్ చిత్తశుద్దిగా అమలు చేస్తున్నాం: ఏపీ డీజీపీ

లాక్‌డౌన్ చిత్తశుద్దిగా అమలు చేస్తున్నాం: ఏపీ డీజీపీ
X

కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామి నిలడానికి లాక్‌డౌన్ చిత్తశుద్దిగా అమలు చేయడమే ప్రధాన కారణమన్నారు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. విశాఖ ఘటనలో పోలీసులు వెంటనే స్పందించారన్నారు. అందువల్లే ప్రాణ నష్టం తగ్గిందని తెలిపారు. విశాఖ ఘటన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉన్న 86 పరిశ్రమలను గుర్తించామని.. జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్లు తెలిపారు. ఇక దేశంలో పోలీసుల సంస్కరణల అమలులోనూ ఏపీ ముందంజలో ఉందన్నారు.

Tags

Next Story