ఆంధ్రప్రదేశ్

ఏపీలో మరో 50 కేసులు

ఏపీలో మరో 50 కేసులు
X

ఏపీలో గత 24 గంటల్లో మరో 50 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1980కి చేరాయి. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరులో 16, కర్నూలులో 13, గుంటూరులో 6, అనంతపురం 5, నెల్లూరు - 5 , ప్రకాశం - 2, కడప, కృష్ణా, విశాఖపట్నంలో చెరో ఒక కేసు చొప్పున మోదయ్యాయి. గత 24 గంటల్లో 8వేల 6వందల 66 శాంపిల్స్ను పరీక్షించగా.. 50 మంది పాజిటివ్‌గా నిర్ధారించారు. ఇక కర్నూలులో ఒకరు మరణించగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 45కి చేరింది. ప్రస్తుతం వెయ్యి పది కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గత 24 గంటల్లో 38 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్‌ అయ్యారు. కర్నూలులో 21 మంది, గుంటూరులో 8, కృష్ణాలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, విశాఖ పట్నంలో ఇద్దరూ, అనంతపురం, నెల్లూరు నుంచి ఒక్కొక్కరు డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్య 925కు చేరింది.

ap corona

Next Story

RELATED STORIES