చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
X

చిత్తూరు జిల్లా పాకాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మండలంలోని గుండ్లగుట్టపల్లి దగ్గర కార్‌ బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. తమిళనాడు నుంచి తెలంగాణలలో కాంట్రాక్టు పనుల నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా పెరియకోయిల్‌కు చెందిన వేలు, మణిబాలన్‌, వేణుగోపాల్‌గా గుర్తించారు. మరో వ్యక్తి మణికంఠ గాయాలతో బయటపడ్డాడు.

Tags

Next Story